బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి నియోజకవర్గం అధ్యక్షులు బాసాని మహేందర్ భువనగిరి అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా గుండు కృష్ణ గౌడ్ ని నియమించడం జరిగినది. అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన KCR తెలంగాణ ను తెచ్చుకున్న తర్వాత, మెజార్టీ బహుజన ప్రజల పైన నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ మోసం చేస్తున్నారని, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్ (IPS)rtd నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గం లో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని బీఎస్పీ అధికారంలోకి వస్తే మాత్రమే Bc, Sc, St, మైనార్టీ ఆగ్రకుల పేదల బాధలు తొలగుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహణ కార్యదర్శి గొల్లపల్లి అనిల్, జిల్లా మహిళా కన్వీనర్ పసునాది సంతోష, భువనగిరి అసెంబ్లీ మహిళా కన్వీనర్ పసునాది రజిత గారు, అసెంబ్లీ కార్యదర్శి బండారు జహంగీర్ గారు, భువనగిరి మండల కన్వీనర్ సిలివేరు నర్సింగ్ రావు గారు, భువనగిరి పట్టణ అధ్యక్షుడు బర్రె నాగేష్ గారు, భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి నల్ల మోహన్, తదితరులు పాల్గొన్నారు
బీఎస్పీ భువనగిరి అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా గుండు కృష్ణ గౌడ్
December 04, 2022
0

