దేశంలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గద్దెనెక్కిన మోదీ సర్కార్ ఉద్యోగాలు కల్పించక పోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ ఉన్న ఉద్యోగాలను వూడగొడుతుందని ఆదివారం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలి పోయాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని యువతను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని తీరా ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం వల్ల ఉన్న ఉద్యోగాలను కోల్పోతున్నారని అన్నారు.
ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి!
December 04, 2022
0

