విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయటానికి టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయని సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సదిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణిత ప్రతిభ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం వల్ల పై చదువుల్లో రాణిష్టకు ఎంతగానో దోహద పడతాయి అన్నారు. సదిశ ఫౌండేషన్ సూర్యాపేట జోనల్ కోఆర్డినేటర్ దా మల్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీ పరీక్షలో 834 మంది విద్యార్థులు నమోదు చేసుకోవడం జరిగిందని అందులో 500 కు పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఈ పరీక్షలో ఉత్తీర్ అయిన వారికి నగదు బహుమతి కనిష్టం 256 నుండి 25600 రూపాయల వరకు పొందవచ్చు అని తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో సదిశ ఫౌండేషన్ విద్యను అందిస్తున్న తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరపు వెంకన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, డిసిసిబి సెక్రెటరీ కళారాణి , సెక్టరుల అధికారి జనార్ధన్, రాంబాబు, వెంకటేశ్వర్లు ప్రతాప్ , తెలంగాణ గణితఫారం రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, అయోధ్య, అశోక్ , మోతిలాల్ , శ్యామ్ , ఎంఈఓ గోపాలరావు సతీష్, ప్రతినిధులు లోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులకు టాలెంట్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి
December 04, 2022
0

