కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని. బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్ర గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఆదివారం నగరంలోని వెంకటేశ్వర టెంపుల్ సమీపంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ , నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలసి సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. పనుల పురోగతిని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్చి 31 లోగా నగరవ్యాప్తంగా నిర్మిస్తున్న నాలుగు సమీకృత మార్కెట్లను ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు.

