ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఆదివారం నాడు నూతనంగా ప్రారంభం కాబోతున్న కె. ఎస్. ఎన్ సేవా ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ నటులు, ప్రముఖ సినీ హీరో సుమన్ హాజరై సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర పట్టణంలో సేవా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క తదితరులు హాజరయ్యారు.

