హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నేతలపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎవరెన్ని దాడులు చేసినా.. కొట్టినా.. చంపినా బెదిరేది లేదని తేల్చి చెప్పారు. తన పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు.
డిసెంబర్ 4 నుంచే షర్మిల పాదయాత్ర హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో షర్మిల సమావేశమయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, టీఆర్ఎస్ నేతల వ్యవహారశైలి, పోలీసు నిర్బంధాలు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. పాదయాత్రను తిరిగి డిసెంబర్ 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు షర్మిల తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని, వారంతా తన కుటుంబమని షర్మిల వ్యాఖ్యానించారు.
భద్రత కల్పించండి: డీజీపీ కార్యాలయానికి వైఎస్ షర్మిల తెలంగాణ డీజీపీకి ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్ షర్మిల.. ఆయన లేకపోవడంతో ఏడీజీ జితేందర్‌ను కలిశారు. పాదయాత్రకు సంబంధించిన వివరాలను అదనపు డీజీకి వివరించి, భద్రత కల్పించాలని కోరారు. పాదయాత్రను కొనసాగించాలని కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని కూడా పోలీసులకు అందించారు. పోలీసుల బాధ్యతను గుర్తు చేశామన్నారు.
బెదిరింపులకు భయపడేది లేదన్న షర్మిల అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. నర్సంపేటలో టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని.. దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టారని ఆమె ఆరోపించారు. బాధితులను హైదరాబాద్ తీసుకొచ్చారన్నారు. సీఎంను కలవడానికి వెళితే.. ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో అరెస్టు చేశారని మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. కేవలం టీఆర్ఎస్ నేతలకే ఫ్రెండ్లీగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 4వ తేదీన పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో.. అక్కడినుంచే ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు షర్మిల.
గూండాలు, తాలిబన్లంటూ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు తెలంగాణలో తాలిబన్ల రాజ్యం కొనసాగుతోందని షర్మిల విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల ముసుగులో ఉన్న గూండాలు.. తాలిబన్లు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తమ పాదయాత్రను ఆపేదేలేదని.. వైటీపీ ప్రజల సమస్యలపై నిలదీస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి.. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుందని ఆరోపించారు. కవిత, కేసీఆర్ కుటుంబం అవినీతిపై పోరాటం కొనసాగుతుందన్నారు. తన మీద విచారణ చేయండి.. అదే విచారణ వాళ్ల మీద కూడా చేస్తారా? అని ప్రశ్నించారు.

వైఎస్ బిడ్డ తెలంగాణ సీఎం కావాలన్న షర్మిల సమైక్య రాష్ట్రం మళ్లీ ఏర్పడుతుందని గోబెల్స్ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మరని షర్మిల అన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని బీజేపీని ప్రశ్నిస్తున్నది, నిలదీస్తున్నది షర్మిల మాత్రమేనని అన్నారు. బీజేపీకి దత్త పుత్రికను కానే కాదని షర్మిల తేల్చి చెప్పారు. బయ్యారం గనులకు తనకు సంబంధం లేదన్నారు. సంక్రాంతి తర్వాత తెలంగాణలో బస్సు యాత్ర చేస్తానని షర్మిల తెలిపారు. తెలంగాణకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ సీఎం కావాలని ఆమె వ్యాఖ్యానించారు. అప్పుడే వైఎస్ సంక్షేమ పాలన రాష్ట్రంలో వస్తుందన్నారు.