హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్టీల రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు ఉన్న 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్టీ రిజర్వేషన్ల పెంచిన తరవాత అందుకు అనుగుణంగా సబార్డినేట్ సర్వీసు రూల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ల శాతానికి తగ్గట్టుగా రోస్టర్లో ప్రభుత్వం మార్పులు చేసింది.
ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై పెంచిన రిజర్వేషన్లకు తగిన విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీలకు మరింత ప్రాధాన్యం దక్కనున్నది.

