గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలోని గ్రామపంచాయతీలకు శుభవార్త చెప్పారు. అతి త్వరలోనే గ్రామపంచాయతీలకు నిధులను భారీగా విడుదల చేస్తామని ప్రకటన చేశారు.
మునుపెన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు మంత్రి దయాకర్ రావు.
