కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్‌కు విడుదల కావాల్సిన జీఎస్టీ బకాయిల కోసం మీ కాళ్లపై పడి వేడుకోవాలా అంటూ ప్రధాని మెడీని ప్రశ్నించారు. ఇవాళ (మంగళవారం) ఝర్‌గ్రామ్‌లో నిర్వహించిన గిరిజనుల కార్యక్రమంలో బిర్సా ముండాకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత మాట్లాడారు సీఎం మమత.
మనం ప్రజాస్వామ్య దేశంలో నివసస్తున్నామా లేదా భారత్ ‘ఏక పార్టీ’ దేశం కింద మారిందా” అని ప్రశ్నించారు సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలతో పాటు నిధులు విడుదల చేయకపోవడంతో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలు నిలిచిపోతున్నాయని అన్నారు. 100 రోజుల ఉపాధి హామీ పథకానికి నిధుల విడుదల తప్పనిసరి అని, ఈ విషయంపై గతేడాది ప్రధానిని కలిసి వివరించానని చెప్పారు. నిధుల కోసం మీ కాళ్లపై పడి వేడుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం మమతా బెనర్జీ.
మా బకాయిలు మాకు ఇవ్వండి.. ఇది మాడబ్బు, లేదంటే జీఎస్టీని రద్దు చేయండి అని అన్నారు సీఎం మమత. 100 రోజుల ఉపాధి పథకం కోసం బకాయిలు చేల్లించకుంటే .. మీరు ప్రధాని కుర్చీ నుంచి దిగిపోండని ఫైర్ అయ్యారు. అంతేకాదు.. బెంగాల్‌కు నిధులు విడుదల చేయకుంటే..జీఎస్టీ చెల్లింపులను నిలిపివేస్తామని స్పష్టం చేశార సీఎం మమతా బెనర్జీ.

