విమాన ప్రయాణీకులకు కరోనా నిబంధనలు సడలింపులిచ్చింది కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని తెలిపింది. మరోవైపు.. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదని సూచించింది. ఎవరైనా మాస్కులు ధరించాలనుకుంటే.. వారి ఇష్టమేనని చెప్పింది.
కరోనా వైరస్ విజృంభించినప్పటి నుంచి ..ఇప్పటివరకు విమాన ప్రయాణికులకు మాస్కులు ధరించడం తప్పనిసరిని కఠినంగా అమలుచేస్తోంది కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ. అయితే.. కొవిడ్ కేసులు తగ్గడంతో ప్రయాణికులు మాస్కులు ధరించేందుకు ఉద్దేశించి విమానాల్లో వేసే జరిమానా పై ఇకపై ఎలాంటి సూచనల్ని ప్రకటించాల్సిన అవసరం లేదంది.

