తనతో సహజీవనం చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ శ్రద్దా వాల్కర్‌ను అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే వ్యక్తి చాలా దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేశారు. ఐతే అతను విచారణలో తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అతనికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. నిందితుడి మానసిక స్థితి ఎలా ఉందో ఆ పరీక్ష ద్వారా తేల్చనున్నారు. ఢిల్లీలోని సాకేత్ కోర్టు.. నార్కో పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. శ్రద్ధా ఫోన్‌ను ఏం చేశాడు, ఆమెను ముక్కలుగా నరికేందుకు వాడిన కత్తి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఢిల్లోలో శ్రద్ధా వాల్కర్ కిల్లర్ కు నార్కోటిక్ పరీక్షలు
November 17, 2022
0
Tags
