మరో రెండు వారాల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా సూరత్ తూర్పు నియోజకవర్గ ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాలా కిడ్నాప్ కలకలం రేపింది. అనూహ్య రీతిలో ఆయన బుధవారం తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. తమ అభ్యర్థి కంచన్, ఆయన కుటుంబం మంగవారం నుంచి కనిపించడం లేదని, బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆప్ ఆరోపించింది.
నామినేషన్‌ను రద్దుకు ప్రయత్నాలు విఫలమవడంతో.. ఉపసంహరణకు బీజేపీ ఆయనపై తీవ్ర ఒత్తిడి చేసిందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్న కొద్దిసేపటికే కంచన్ జరీవాలా సూరత్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆప్ ఆరోపణలు నిజమనేలా ఆయన నామినేషన్ ఉపసంహరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.

