మినిస్టర్ అప్పలరాజు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబును ఆయన ఇంట్లో వాళ్లైనా వారిస్తారా అనే అననుమానం తనకు ఉందని.. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు పర్యటన చూస్తే నిజం ఒప్పుకున్నట్లు ఉందన్నారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారతారని.. చంద్రబాబు ఏడుపులు, గగ్గోలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు తనయుడు లోకేష్‌పై ఆశలు లేవని..
జీవితంలో మొట్ట మొదటిసారిగా నిజం మాట్లాడారన్నారు ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు (Seediri Appalaraju). 2024 ఎన్నికలు టీడీపీని సమాధి కట్టే ఎన్నికలని.. 2024 ఎన్నికలే చివరివి అన్నారు. చంద్రబాబు పాడెక్కేశాను బ్రతికించండి అన్నట్టు మాట్లాడారని.. మళ్లీ తన భార్యను చంద్రబాబే రాజకీయాల్లోకి లాగారు సానుభూతి డ్రామా కోసమే అన్నారు. చంద్రబాబుకు సిగ్గు.. ఎగ్గు ఉండవని.. ఎలాంటి నీచానికైనా దిగజారుతారని నిరూపించుకున్నారన్నారు. చంద్రబాబును ఆయన ఇంట్లో వాళ్లైనా వారిస్తారా అని తనకు అనుమానం ఉందన్నారు.
చంద్రబాబు లేని విషయాన్ని ఎందుకు పబ్లిసిటీ చేస్తారని వారించరా అంటూ ప్రశ్నించారు. ఆయన చేసిన పనులు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి వ్యతిరేకమన్నది నిజం కాదా అన్నారు. రాయలసీమలో చంద్రబాబును తన్ని తరిమేస్తారని.. ఉత్తరాఖండ్‌లో హైకోర్టు మార్చుకో గలిగినపుడు ఏపీలో ఎందుకు కుదరదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని.. ముఖ్యమంత్రి జగన్‌ను చంద్రబాబు వంటి వ్యక్తులు ఏమీ చేయలేరన్నారు. వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాష వాడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు మంత్రి. చంద్రబాబువి అన్నీ ఆర్భాటాలు.. చంద్రబాబు పుట్టుకే ఒక 420 అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఏనాడూ ఇలా ఏడుపు మాటలు మాట్లాడలేదని.. సానుభూతి రాజకీయాలకు సీఎం జగన్‌కు ఉన్న అవకాశం ఏ రాజకీయ నాయకుడికీ లేదన్నారు. అయినా సీఎం జగన్ ఒంటరిగానే నడిచారు.. ఒంటరిగానే సీఎం అయ్యారన్నారు. సీఎం జగన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి చంద్రబాబుకు లేదన్నారు.
చంద్రబాబు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారని.. ప్రతిపక్ష పాత్ర కోసం బీజెపీ ఎదురుచూస్తోందన్నారు అప్పలరాజు. చంద్రబాబు పోతేనే బీజేపీకి ప్రతిపక్ష పాత్ర.. పవన్ కళ్యాణ్‌కు కూడా మోదీ ఇదే చెప్పి ఉంటారన్నారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నది చంద్రబాబు.. ప్రజలకు ఏం చేశాడు కనుక ఆయనకు ఓటేయాలని ప్రశ్నించారు. పార్టీ లేదు బొక్కా లేదు అన్న అచ్చెం నాయుడి మాటలు చంద్రబాబు నిజం చేశారన్నారు. ఆయన ఎన్ని నాటకాలు ఆడినా జనం నమ్మరన్నారు.
వెన్నుపోటు, నమ్మకద్రోహమే చంద్రబాబు పెట్టుబడి అన్నారు సీదిరి. ఆయన పాలనలో ఆయన వర్గానికే మేలు జరిగిందని.. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని విమర్శించారు. చంద్రబాబు ఏడుపులు, గగ్గోలు చూసి జనం నవ్వుకుంటున్నారని.. తనయుడు లోకేష్‌పై చంద్రబాబుకు ఆశలు లేవన్నారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వికేంద్రీకరణను పక్కదారి పట్టించేందుకే కర్నూల్‌లో బాబు పర్యటిస్తున్నారని చెప్పుకొచ్చారు.
