పట్టిందల్లా బంగారమన్నట్టు కెరీర్ సాగుతుండగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపింది సమంత . దీంతో టాలీవుడ్ సెలబ్రెటీలంతా వరుస ట్వీట్స్ తో సంఘీభావం తెలిపారు. మేమెంత ఉన్నామంటూ దైర్యం చెప్పారు. అయితే అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున, నాగ చైతన్యలు మాత్రం స్పందించలేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో వీరిద్దరిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎంత విడాకులు అయితే మాత్రం ఆరోగ్యం బాలేనప్పుడు పలకరించారా అని విమర్శించారు. అయితే బయట సీన్ ఇలాగుంటే.. లోపల జరిగింది మాత్రం ఇంకోటట. నాగార్జున, నాగ చైతన్యలు జబ్బుతో ఉన్న సమంతకి వెన్నంటే ఉన్నారంట. వ్యక్తిగతంగా కలిసి మరి సమంతకి మద్దత్తుగా నిలిచారట.
అక్కినేని హీరోల ప్రేమ అనురాగాలకి ఫిదా అయిపోయిందట సమంత. దీంతో సమంత తన మనసు మార్చుకుందని అంటున్నారు. తొందరపడి తీసుకున్న విడాకులని రద్దు కూడా చేసుకునే ఆలోచనలో ఉందట సమంత. వ్యాధి పూర్తిగా నయమవ్వగానే డైరెక్ట్ గా నాగార్జునని సమంత కలవబోతుందని కథనాలు వస్తున్నాయి. నాగచైతన్యతో తిరిగి కాపురం చేసే ఆలోచనలో సమంత ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. విడాకులు వెనక్కి తీసుకుని, అక్కినేని కుటుంబంతో కలిసి పోవాలని అనుకుంటుందట. వివాదాలన్నీ పక్కన పెట్టేసి మళ్లీ కలావాలనుకోవడం మంచి ఆలోచన’.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. చై, సామ్ ఫ్యాన్స్ మాత్రం.. ‘‘మనసు మారితే మంచిదే.. ఇది మంచి పరిణామమే కదా’’ అంటున్నారు.

