నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) నిర్వహించనున్నారని వెల్లడించారు. 2020లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టానికి సవరణలు చేసిన కేంద్రప్రభుత్వం.. నీట్-పీజీ స్థానంలో నెక్ట్స్ నిర్వహించాలని నిర్ణయించింది. 2023 డిసెంబర్‌లో మొదటి నెక్ట్స్ నిర్వహించనున్నారు.
నీట్-పీజీ పరీక్ష పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మాత్రమే నిర్వహిస్తుండగా.. నెక్ట్స్ ద్వారా పీజీలో సీటుతోపాటు వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకొనేందుకు లైసెన్సుగా ఉపయోగపడుతుంది. అలాగే విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు నెక్ట్స్ పాసైతే మనదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్ చేసుకొనేందుకు, పీజీ చేసేందుకు కూడా అనుమతి లభిస్తుంది.

