Type Here to Get Search Results !

కూతురి వివాహానికి జయలలితని రావొద్దన్న కృష్ణ..!

 


ఎన్టీఆర్, ఏఎన్నార్ మృతి తరువాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణ, కృష్ణంరాజులు నెల రోజుల వ్యవధిలో చనిపోవటం జరిగింది. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజుల కంటే.. కృష్ణకి ధైర్య సాహసాలు ఎక్కువని అంటుంటారు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మాటే శాసనంగా ఉన్న రోజుల్లోనే.. ఎన్టీఆర్ వద్దన్నా వినకుండా అల్లూరిసీతారామరాజు సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కృష్ణ. ఇక తన భార్య విజయనిర్మల కోరిక మేరకు.. అక్కినేని నాగేశ్వరావు నొచ్చుకుంటాడని తెలిసినా.. దేవదాసుని మళ్ళీ తెరకెక్కించాడు. అప్పట్లో ఎన్టీఆర్ ని గద్దె దించగానే.. నాదెండ్ల భాస్కర్ ని పొగుడుతూ బహిరంగ లేఖ రాసి సినీ రాజకీయాల్లో కృష్ణ ప్రకంపనలు సృష్టించారు. అలాంటి కృష్ణ ఒకసారి సీఎం సెక్యూరిటీ పై కూడా సీరియస్ అయిన మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడు రెబెల్ ముఖ్యమంత్రి జయలలిత తీరుకి నొచ్చుకున్న కృష్ణ మొహమాటం లేకుండా ఆగ్రహించారట. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తన కుమార్తె పెళ్లి సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది.

కృష్ణ కూతురి వివాహం మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ సిబ్బంది కృష్ణకి కాల్ చేశారట. జయలలిత పెళ్లికి వస్తున్నారని.. కళ్యాణ మండపంలో తొలి మూడు వరుసల సీట్లని జయలలిత, ఆమె అనుచరుల కోసం కేటాయించాలని కోరారట. దానికి కృష్ణ మొహమాటం లేకుండా నో చెప్పారట. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేంద్ర కాంగ్రెస్ పెద్దలు ఎంతోమంది పెళ్ళికి వస్తున్నారని.. వారికి సీట్లన్నీ బుక్ అయిపోయాయని.. కావాలంటే జయలలితకు ముందువరుసలో, ఆమె అనుచరులకు వెనకాల సీట్లు ఏర్పాట్లు చేస్తానని చెప్పారట. కానీ సెక్యూరిటీ సిబ్బంది మొదటి మూడు వరుసపైనే పట్టుబట్టడంతో వారిపై సీరియస్ అయ్యి, నేను జయతోనే మాట్లాడుతా మీరు ఫోన్ పెట్టేయండి అని.. నేరుగా ఆమెకి కాల్ చేశారట. అదే విషయాన్ని జయలలితకి ఫోన్ చేసి చెప్పి.. ‘‘మీరు వివాహానికి రావొద్దు.. దంపతులకి మీ ఆశీర్వాదం ఉంటే చాలు’’ అని చెప్పారట. దాంతో జయలలిత నవ్వేసి.. పెళ్లి రోజున నూతన దంపతుల్ని ఆశీర్వదిస్తూ ఓ బొకెని పంపారట. అయితే జయలలిత నటిగా ఉన్నప్పటి నుండి కృష్ణతో అనుబంధం ఉండేది. కృష్ణకి జయలలిత అభిమాని అని కూడా అంటారు. ఆ చనువుతోనే కృష్ణ నేరుగా జయలలితని వివాహానికి రావొద్దని చెప్పారట.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad