ప్రధాని నరేంద్ర మోదీ 13 రోజుల క్రితం ప్రారంభించిన రైల్వే ట్రాక్‌పై (Railway track Explosion) పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి పట్టాలపై పేలుడు సంభవించింది. దాంతో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తం అయి రైల్వే సిబ్బందికి చెప్పారు. దాంతో వారు వెంటనే అటువైపుగా వచ్చే ట్రైన్ ఆపేశారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఎవరో దుండగులు కావాలనే ఈ పని చేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానాంశాలు:
- దెబ్బ తిన్న ఉదయ్‌పూర్ రైల్వే ట్రాక్‌పై
- స్థానికులు అలర్ట్ కావడంతో తప్పిన ముప్పు
- దీని వెనుక కుట్ర ఉందంటున్న పోలీసులు
