Kerala Bride పెళ్లి తర్వాత స్నేహితులతో షికార్లు, మందు పార్టీలకు చెక్ పడటం సహజం. అప్పటి వరకూ స్నేహితులతో ఎంతో సరదాగా గడిపిన వాళ్లు ఒక్కసారి వైవాహిక జీవితంలోకి వెళ్లాకా మారక తప్పదు. కానీ, ఓ వధువు తన భర్త విషయంలో విశాలంగా ఆలోచించింది. పెళ్లి తర్వాత స్నేహితులు దూరం కాకూడదనే ఉద్దేశంతో కొంత వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఏకంగా బాండ్ పేపర్ రాసి పెళ్లికి వచ్చిన స్నేహితులను విస్తుపోయేలా చేసింది.
ప్రధానాంశాలు:
- స్నేహితులతో తిరగడానికి భర్తకు అనుమతి
- కేరళ వధువు రాసిచ్చిన బాండ్ పేపర్ వైరల్
- అసోం, తమిళనాడులో ఇలాంటి ఘటన
ఇటీవల అసోంలోనూ ఇలాంటి ‘ఒప్పందమే’ జరిగింది. శాంతి ప్రసాద్-మింటూ రాయ్ పెళ్లి పీటల మీదే ఓ తెల్ల కాగితంపై సంతకాలు చేశారు. పెళ్లి తర్వాత ఇంటి భోజనమే తినాలి.. డ్రెస్‌లు, జీన్స్ ఊసే లేకుండా రోజూ తప్పనిసరిగా చీరలను ధరించాలి.. 15 రోజులకోసారి ఆమెను భర్త షాపింగ్‌కు బయటకు తీసుకెళ్లాలి.. పార్టీలకు అనుమతి.. ప్రతి పార్టీలోనూ మంచి ఫోటోలను తీసుకోవడం.. ఆదివారం నాడు భర్త బ్రేక్‌ఫాస్ట్ సిద్దం చేయడం.. రోజూ తప్పనిసరిగా జిమ్‌కు వెళ్లాలని కండిషన్లు పెట్టుకున్నారు. ఇదంతా చూసి పెళ్లికొచ్చిన అతిథులు ముక్కున వేలేసుకున్నారు.
తమిళనాడులోనూ వధువుతో పెళ్లి పీటలపైనే వరుడి స్నేహితులు తమతో వారాంతాల్లో క్రికెట్ ఆడటానికి అనుమతించాలని బాండ్ పేపరుపై హామీ తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన కూడా వైరల్ అయ్యింది.

