భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అర్జున అవార్డు తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ను వరించింది. నిఖత్ జరీన్‌కు అర్జున అవార్డు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బాక్సింగ్‌లో వరుస విజయాలను నమోదు చేస్తూ దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలు అని అన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో ను గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది.

