టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కింగ్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. గత రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
భారత్ సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్ కోహ్లీ మ్రాతం టాప్ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు. కోహ్లీ ఆరు ఇన్నింగ్స్‌లలో 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
2014లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. 106.33 సగటుతో 319 పరుగులు చేశారు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.
ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్‌లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ఆటగాడు కూడా కోహ్లీయే. మొత్తం 27 మ్యాచ్‌ల్లో 81.50 సగటుతో 1,141 పరుగులు చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

