ప్రముఖ టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు దక్కింది. 2022 ఏడాదికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు అతన్ని వరించింది. కేంద్ర క్రీడా యువజన మంత్రిత్వ శాఖ నేషనల్ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటించింది.ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ లో శరత్ కమల్ నాలుగు మెడల్స్ గెలిచాడు. అందులో మూడు గోల్డ్ మెడల్స్. దీంతో కామన్వెల్త్ గేమ్స్ లోనే అతనికి వచ్చిన మొత్తం మెడల్స్ సంఖ్య 13కు చేరింది.
మరోవైపు తెలంగాణ బాక్సింగ్ క్వీన్.. వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ యంగ్ సెన్సేషన్ లక్ష్య సేన్‌కు అర్జున అవార్డు దక్కింది. అథ్లెటిక్స్ లో సీమా పూనియాకు కూడా ఈ ఏడాది అర్జున అవార్డు దక్కింది. ఈసారి 25 మందికి అర్జున అవార్డులు ప్రకటించింది.

