పోలీస్ స్టేషన్ కు వివిధ సమస్యలతో వచ్చే దివ్యాంగుల కొరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సి. ఐ, డిఎస్పీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. వినీత్. జి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలీసు అధికారులను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుపుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనికి, కార్యాలయాలలోకి సులభంగా ప్రవేశించే విధంగా వీల్ ఛైర్స్ మరియు ర్యాంపులు వంటి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పోలీస్ స్టేషన్లలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు పూర్తి: ఎస్పీ
December 03, 2022
0
