Russia Withdraw ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య పేరుతో యుద్ధం చేస్తున్న రష్యాకు భారీ నష్టమే వాటిళ్లింది. ఉక్రెయిన్ నాటోలో చేరుతుందనే కారణంతో పొరుగు దేశంపై దండయాత్ర సాగించిన రష్యాపై ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆ దేశ వాణిజ్య కార్యకలాపాలు, ఎగుమతులతో పాటు ఆర్థిక లావాదేవీలపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. రోజు రోజుకూ సైన్యం శక్తి కూడా సన్నగిల్లుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల నుంచి మాస్కో వైదొలగుతున్న విషయం తెలిసిందే.

ప్రధానాంశాలు:
- 8 నెలలుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం
- ఖెర్సొవ్ చుట్టుపక్కల నుంచి రష్యా ఉపసంహరణ
- క్రమంగా పట్టుసాధిస్తున్న ఉక్రెయిన్ బలగాలు.
కాగా, రష్యా బలగాలు పేలుడు పదార్థాలను వదిలిపెట్టాయన్న అనుమానంతో.. వాటిని తొలగించేందుకు నిపుణులు రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా.. ఖెర్సొన్ సమీపంలో ఉన్న మైకోలైవ్ నగరంలోని నివాసిత ప్రాంతాలపై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఖెర్సోన్ నుంచి రష్యా బలగాలు వైదొలగినా.. ఈ ప్రాంతంలో యుద్ధం ముగియలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రాంతం నుంచి రష్యా సేనల ఉపసంహరణ అటు మాస్కో, ఇటు ఉక్రెయిన్‌కు సవాళ్లు విసిరే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
