Hyderabad: ఐటీ కంపెనీలకు అడ్డాగా హైదరాబాద్ ఉంది. నగరంలో అన్ని మల్టీ నేషనల్ కంపెనీలు కొలువుదీరాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. నగరంలో ఉన్న ట్రాఫిక్ రద్దీతో పాటు చాలా ప్రాంతాల నుంచి నేరుగా ఆఫీస్‌కి చేరుకోవాలంటే డైరెక్ట్ బస్సులు ఉండవు. దీంతో ఐటీ ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు చేరుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడపనుంది.

ప్రధానాంశాలు:
- ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- ప్రత్యేక బస్సు సర్వీసులు ప్రారంభించనున్న TSRTC
- డిసెంబర్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఐటీ కంపెనీలు ఎక్కువగా నడుస్తోన్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగులు.. తమ ఆఫీసులకు వెంటనే చేరుకునేందుకు వీలుగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. బస్సు సౌకర్యం కావాలనుకునే ఐటీ ఉద్యోగులు డిసెంబర్ 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
