దాదాపు మూడేళ్ల కిందట చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారిగా మారి యావత్తు ప్రపంచాన్నీ గడగడలాడించింది. కోవిడ్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. వేలాది కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన కరోనా.. ప్రస్తుతం అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తున్నా.. అలసత్వం వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ జన్యుమార్పులతో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మరోసారి దాడిచేసే ప్రమాదం లేకపోలేదని వైద్యులతో పాటు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ సంఘటన 2020లో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్‌లో కోవిడ్-19 కల్లోలాన్ని గుర్తుచేస్తోంది. అప్పట్లో రూబీ క్రూయిజ్ నౌకలో ప్రయాణించిన 914 మంది కరోనా వైరస్ బారినపడగా.. 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు విచారణలో వెల్లడయ్యింది. రూబీ ప్రిన్సెస్ ఘటన నేపథ్యంలో అధికారులు రెగ్యులర్ ప్రోటోకాల్ రూపొందించారని, మెజెస్టిక్ ప్రిన్సెస్ నుంచి ప్రయాణీకులను కేసు వారీగా ఎలా తీసుకురావాలనే న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని హోం మంత్రి క్లేర్ ఓనీల్ చెప్పారు. రాష్ట్ర యంత్రాంగానికి కేంద్ర సరిహద్దు దళం అధికారి అనుబంధంగా బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య విభాగం ప్రకారం.. గ్లోబల్ లీజర్ కంపెనీ కార్నివాల్ కార్పొరేషన్ అండ్ పీఎల్‌సీలో భాగమైన కార్నివాల్ ఆస్ట్రేలియా.. వైరస్ నిర్దారణ అయిన ప్రయాణీకులు లోపల ఐసోలేషన్‌లో ఉన్నారని, వైద్య సిబ్బంది శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పింది. ప్రయాణీకులు, సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి క్రూయిజ్ షిప్ సిబ్బందితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.

సంస్థ అధ్యక్షుడు మార్గ్యురైట్ ఫిట్జ్‌గెరాల్డ్ ఏబీసీ టెలివిజన్‌తో మాట్లాడుతూ.. కార్నివాల్‌లో పెద్ధ సంఖ్యలో కోవిడ్ కేసులు వెలుగుచూసిన తర్వాత అదనపు ప్రోటోకాల్ పాటిస్తున్నామని తెలిపారు. ఆస్ట్రేలియా వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని, Omicron సబ్-వేరియంట్ XBB వల్ల సామాజిక వ్యాప్తికి అవకాశం ఉందని ఫెడరల్ ప్రభుత్వం ఈ వారం తెలిపింది.