హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రచేసి అడ్డంగా దొరికిపోయిన బీజేపీ.. మరో మూడు రాష్ట్రాల్లోనూ ఇదే తరహా కుట్రకు పావులు కదిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిట్ దర్యాప్తులో నిందితులు సంచలన విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌తో స్నేహపూర్వకంగా ఉంటూనే.. అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు నిందితులు వెల్లడించినట్టు తెలిసింది. వాస్తవానికి బీజేపీ ఏపీలో ఒక్క సీటు గెలవలేదు. కానీ వైఎస్సార్సీపీకి చెందిన 70 మంది ఎమ్మెల్యేలను కొనడానికి పన్నాగం పన్నారని తెలిసింది. వారిలో 55 మంది ఇప్పటికే బీజేపీ బ్రోకర్ల టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

ఒక్కో ఎమ్మెల్యేకు 50-100 కోట్లు
ఏయే రాష్ట్రాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయో.. నిందితులు అధికారులకు పూసగుచ్చినట్టు వివరించారని విశ్వసనీయ సమాచారం. ఈ వివరాల ప్రకారం ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఒక్కో ఎమ్మెల్యేకు స్థాయిని బట్టి రూ.50-100 కోట్లు ఆశ జూపాలని వీరు నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో 55, ఢిల్లీలో 43, రాజస్థాన్‌లో 21 మందితో ఇప్పటికే బేరసారాలు ప్రారంభించినట్టు విచారణలో తెలిపినట్లు సమాచారం.
