Type Here to Get Search Results !

రైలు వెళుతుండగానే ఇంజిన్​ నుంచి వేరైన బోగీలు.. ఎక్కడంటే!

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం ఐబీ గేటు సమీపంలో గూడ్స్​ రైలు ఇంజిన్​ వెనుక కొన్ని బోగీలు విడిపోయాయి. ఇంజిన్ అర కిలోమీటర్​ దూరం ముందుకెళ్లింది. దానిని గమనించిన పైలెట్లు రైలు​ను వెంటనే ఆపేశారు.



సాంకేతిక సిబ్బంది బోగీలను ఇంజిన్​కు అమర్చారు. చిన్న చిన్న మరమ్మతుల అనంతరం మళ్లీ గూడ్స్​ రైలు ముందుకు కదిలింది. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల వ్యవధిలోనే ఓ ఎక్స్​ప్రెస్ రైలు సాఫీగా వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు బోగీలు ఎందుకు విడిపోయాయోనని అధికారులు విచారణ చేస్తున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad