వాంకిడి మండలానికి సరిహద్దులోని (మహారాష్ట్ర)రాజూర తాలుకాలోని లక్కడ్ కోట్ గ్రామ శివారులో శనివారం పులి దాడి జరిగింది. ఖిర్ది గ్రామానికి చెందిన రైతు జంగు(58) శనివారం గ్రామ శివారులోని అటవి ప్రాంతంలో గల తన చేనులో కుటుంబ సబ్యులతో కలిసి పత్తి ఏరేందుకు వెళ్లాడు. సాయంత్రం పులి అరుపుల చప్పుడు కావడంతో పొలంగట్టు మీద కట్టేసి ఉన్న ఎడ్లను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న పులి అమాంతం జంగుపైకి దాడి చేసి హతమార్చింది. దాడిలో తల మొండెం వేరు చేసినట్లు స్తానికులు గుర్తించారు.
పులి దాడిలో రైతు మృతి
December 04, 2022
0

