Type Here to Get Search Results !

లైఫ్ రిస్క్ చేసినా, లైట్ తీసుకున్నారా? సమంతకి ఏంటీ పరిస్థితి?

 ఒకవైపు కండరాల ఇన్ఫెక్షన్ తో కదలలేని పరిస్థితి.. మరోవైపు మాయోసైటిస్ ఒక ప్రాణాంతక వ్యాధి అంటున్న నిపుణులు.. ఎన్నో విపత్కర పరిస్థితుల్లోనూ ఫైటర్ లా మారిన సమంత సెలైన్ పెట్టుకుని మరి యశోద మూవీ డబ్బింగ్ పూర్తి చేసింది. జబ్బులోనే యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించిన సామ్.. ప్రమోషన్స్ లోను అస్సలు తగ్గలేదు. ఆరోగ్యం సహకరించకున్నా నిర్మాతల కోసం ఇంటర్వ్యూలు చేసి ప్రమోట్ చేసింది. ‘ఇంకా ప్రాణాలతోనే ఉన్నా’ అంటూ కన్నీళ్లు పెట్టేసింది సమంత. దాంతో ఒక్కసారిగా సమంతపై సింపతీ వేవ్ ఎగిసిపడింది. ఈ వేవ్ యశోద మూవీని బ్లాక్ బస్టర్ చేసేస్తుంది అనుకున్నారు. కానీ లెక్కలు తారుమారు అయ్యాయి. 40కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది యశోద. సుమారుగా 55 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 55కోట్లు క్రాస్ చేయాలి. ఏముంది సామ్ క్రేజ్ తో ఫస్ట్ వీక్ లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఆశించిన స్థాయిలో యశోద కలెక్షన్స్ రాకపోగా.. తాజా ట్రెండ్ ప్రకారం భారీ డిజాస్టర్ అయ్యే పరిస్థితి.




ప్రస్తుతం హిట్ టాక్ వచ్చిన స్టార్ హీరోల సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయటంలేదు. సామ్ కి కూడా అదే పరాభవం తప్పేలా లేదు. 50కోట్ల ‘కాంతారా’ వసూళ్లను బీట్ చేస్తుందని అనుకుంటే బాక్సాఫీస్ దెగ్గర చతికిలపడింది యశోద. తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. మొదటి వారం నాటికి పది కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. రెండో వారంలో ఇంతకంటే గొప్పగా ఏం ఆశించలేం. 40కోట్ల బడ్జెట్ లో ఇప్పటివరకు పావు వంతు షేర్స్ కూడా రాబట్టలేకపోయింది యశోద. దీన్ని బట్టి సామ్ సినిమా ‘కాంతారా’ని బీట్ చేయడం కాదు కదా.. దరిదాపుల్లోకి చేరుకునే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘యశోద’ కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే డిజాస్టర్ అనే చెప్పొచ్చు. ఇక బాక్సాఫీస్ దెగ్గర లాభాలు రాకున్నా.. ఓటిటీనే యశోదని గట్టెక్కించాలి. థియేట్రికల్ రిలీజ్ ద్వారా నష్టాలే మిగిలాయి కాబట్టి నాన్ థియేట్రికల్ హక్కులు మాత్రమే యశోద నిర్మాతను కాపాడాలి అంటున్నారు ట్రేడ్ నిపుణులు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad